logo

Tirumala: భార్యను మోసుకుంటూ తిరుమల మెట్లెక్కిన భర్త

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన వరదా వీరవెంకట సత్యనారాయణ (సత్తిబాబు), లావణ్యకు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరి కుమార్తెలకు వివాహాలు చేశారు. ఆ దంపతులు ఇటీవల తిరుపతికి వెళ్లారు.

Updated : 03 Oct 2022 08:22 IST

కడియం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన వరదా వీరవెంకట సత్యనారాయణ (సత్తిబాబు), లావణ్యకు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరి కుమార్తెలకు వివాహాలు చేశారు. ఆ దంపతులు ఇటీవల తిరుపతికి వెళ్లారు. తిరుమలలోని శ్రీవారిని కాలినడకన దర్శించుకోవడానికి బయలుదేరారు. మెట్ల మార్గంలో సత్తిబాబు వేగాన్ని ఆయన భార్య అందుకోలేకపోయారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ పందేనికి దారితీసింది. ఆ మేరకు సత్తిబాబు భార్యను భుజాలపై ఎత్తుకుని దాదాపు 70 మెట్లు ఎక్కేశాడు. ఆ దృశ్యాలను ఇతర భక్తులు చరవాణుల్లో బంధించారు. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి.

Read latest Chittoor News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని