logo

మత్స్యవతారవిందం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యనారాయణుడు దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై మత్స్య నారాయణుడి అలంకరణలో భక్తులను కటాక్షించారు. సూర్యుడు సకల రోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు.

Updated : 04 Oct 2022 05:10 IST

సూర్యప్రభ వాహనంపై నారాయణుడు


స్నపన తిరుమంజనంలో ఉత్సవ మూర్తులకు హారతి

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యనారాయణుడు దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై మత్స్య నారాయణుడి అలంకరణలో భక్తులను కటాక్షించారు. సూర్యుడు సకల రోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతైన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి నర్తన కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.


బెంగళూరు కళాకారుల రూపకం

వైభవంగా స్నపన తిరుమంజనం: మధ్యాహ్నం శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు  మొదటిసారిగా పిస్తాబాదం, కుంకుమపువ్వుతో మాలలు, కిరీటాలు ధరింపజేశారు. తమిళనాడుకు చెందిన దాతలు రాజేంద్రన్‌, షణ్ముగ సుందరం, బాలసుబ్రహ్మణ్యం అందించిన విరాళంతో హైదరాబాద్‌కు చెందిన అంబికా ఫ్లోరా సంస్థ మాలలు తయారు చేసింది.  వాహనసేవలో శ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీ చిన్నజీయర్‌ స్వామి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, బోర్డు సభ్యులు, ఎంపీలు గురుమూర్తి, రెడ్డెప్ప జేెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహకిశోర్‌, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు పాల్గొన్నారు.


రామసేతు ఘట్టాన్ని ప్రదర్శిస్తున్న ముంబయి కళాకారులు

బ్రహ్మోత్సవాల్లో నేడు

శ్రీవారి మహా రథోత్సవం మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వర్ణ అశ్వ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.


మైసూరు వాసుల నృత్య ప్రదర్శన


స్నపన తిరుమంజనం సందర్భంగా అత్తిపండ్లు, నేరేడుపండ్లు, పిస్తా-బాదం-యాలకులు, జొన్నలతో చేసిన కిరీటాలు


కుంకుమ పువ్వుతో చేసిన పూలమాలలు చూపుతున్న గార్డెన్‌ డీడీ శ్రీనివాసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని