logo

మహిషాసురమర్దిని పాహిమాం

చౌడేపల్లె మండలంలోని బోయకొండపై వెలసిన బోయకొండ గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిషాసురమర్థిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది.

Published : 05 Oct 2022 05:52 IST

చౌడేపల్లె మండలంలోని బోయకొండపై వెలసిన బోయకొండ గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిషాసురమర్థిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ రూపంలో అదిశక్తిని దర్శించుకుంటే ఆపదలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. దీంతో ఉదయం నుంచి అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. యాగశాలలోని వేదపండితులు అమ్మవారి శతనామాలపాన చేశారు. ఉభయదారులకు ఆలయ ఆలయ ఛైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈవో చంద్రమౌళిలు సేవలందించారు.  - చౌడేపల్లె, న్యూస్‌టుడే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని