logo

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అనిశా తనిఖీలు

అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం చిత్తూరులోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. చిత్తూరు నగరంలో నకిలీ పత్రాలతో సాగించిన అక్రమ భూ రిజిస్ట్రేషన్‌ వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Published : 05 Oct 2022 05:52 IST

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం చిత్తూరులోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. చిత్తూరు నగరంలో నకిలీ పత్రాలతో సాగించిన అక్రమ భూ రిజిస్ట్రేషన్‌ వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనిశా అధికారులు చిత్తూరులోని అర్బన్‌, రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీ చేపట్టారు. కంప్యూటర్లలో డేటా పరిశీలించి కొన్ని కీలక వివరాలు సేకరించారు. ఈ రిజిస్ట్రేషన్లు ఎప్పుడు జరిగాయి? క్రయవిక్రయదారులు ఎవరు? దస్తావేజులు ఎవరు సిద్ధం చేశారు? తదితర వివరాలు పరిశీలించినట్లు సమాచారం. అనిశా అధికారులు కార్యాలయంలోకి రంగప్రవేశం చేయగానే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బయటకి పంపించి, కీలక సమాచారాన్ని సేకరించారు. ఇదిలా ఉండగా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కొన్ని దస్తావేజుల్ని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు పరిశీలిస్తు న్నారు. మొత్తం ఆరు దస్తావేజులు అందగా.. అధికారులు వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. వీటిలో మూడింటి వివరాలు సక్రమంగా లేనట్లు సమాచారం. ఒక దస్తావేజు పరిశీలన పూర్తయినట్లు తెలుస్తోంది.

రెవెన్యూ పాత్రపై వీడని సస్పెన్స్‌?
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ వ్యవహారానికి రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన దస్తావేజులే కీలకంగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కుట్రలో భాగస్వామ్యం వహించిన రెవెన్యూ సిబ్బంది ఎవరు? వారి ప్రమేయం ఏమిటనే విషయాలపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని