logo

సమస్యలు పరిష్కరించాలని వినతి

అటవీశాఖ పరిధిలో పొరుగు సేవలు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగ సంఘ నాయకులు జిల్లా అటవీశాఖాధికారి చైతన్యకుమార్‌రెడ్డిని కోరారు.

Published : 05 Oct 2022 05:52 IST

డీఎఫ్‌వోకు వినతిపత్రం ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: అటవీశాఖ పరిధిలో పొరుగు సేవలు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగ సంఘ నాయకులు జిల్లా అటవీశాఖాధికారి చైతన్యకుమార్‌రెడ్డిని కోరారు. మంగళవారం వారు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. కాంట్రాక్ట్‌ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, బేస్‌ క్యాంపు స్ట్రైక్‌ ఫోర్స్‌ సభ్యులకు ప్రతి నెలా వేతనాలు అందజేయాలన్నారు. బదిలీల నేపథ్యంలో స్పోర్ట్స్‌ కేటగిరి ఉన్న వారికి అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ కింద లేదా డిప్యూటేషన్‌పై వారివారి జిల్లాలకు పంపాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు త్వరగా భర్తీ చేయాలన్నారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని డీఎఫ్‌వో హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ జిల్లా నాయకులు వినాయకం, సుశీలమ్మ, అరుళ్మణి, గుణశేఖర్‌, బాబు, మునిరత్నం, వెంకటేష్‌, తులసీరామ్‌, సరస్వతి, నాగరాజు, బాలాజీ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని