logo

సమన్వయంతో రీసర్వే పూర్తిచేయాలి

భూముల రీసర్వే కార్యక్రమన్ని సమన్వయంతో పనిచేసి పూర్తిచేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర సిబ్బందితో ఆయన మాట్లాడారు.

Published : 05 Oct 2022 05:52 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భూముల రీసర్వే కార్యక్రమన్ని సమన్వయంతో పనిచేసి పూర్తిచేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర సిబ్బందితో ఆయన మాట్లాడారు. జిల్లాలో 645 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తికాగా, 175 గ్రామాలకు ఓఆర్‌ఐ షీట్లు వచ్చాయని, 92 గ్రామాల్లో డీఎల్‌ఆర్‌ పూర్తికాగా, 58 గ్రామాల్లో తుది ఆర్‌వోఆర్‌ ప్రక్రియ పూర్తికాగా, 30 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూథింగ్‌ సాగుతోందన్నారు. నిర్ణీత కాల పరిమితిలోగా ఈ పనులు పూర్తిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులు లేకుండా సిబ్బంది మధ్య సమన్వయం ఉండాలన్నారు. రీసర్వేలో వెనుకబడిన మండలాల్లో పనితీరు మెరుగుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల ఏడో తేదీ లోగా డీఎల్‌ఆర్‌ ప్రక్రియ, 10లోగా ఆర్‌వోఆర్‌ పూర్తికావాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని