logo

గజగజ

సాధారణంగా డిసెంబరులో కనిపించే చలితీవ్రత.. ఈసారి నవంబరు నుంచే మొదలైంది.

Published : 25 Nov 2022 02:09 IST

చలితో వణుకుతున్న జిల్లా
దట్టంగా పొగమంచు
అవస్థల్లో ప్రజలు

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సాధారణంగా డిసెంబరులో కనిపించే చలితీవ్రత.. ఈసారి నవంబరు నుంచే మొదలైంది. ఎముకలు కొరికే చలి జిల్లా వాసుల్ని గజగజా వణికిస్తోంది. రాత్రివేళతోపాటు పగటి ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయింది. సాయంత్రం నుంచే చలి తీవ్రత అధికమవుతోంది. రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు రావడానికి తీవ్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఏడు గంటల వరకు కొన్నిచోట్ల సూర్యుడి జాడ కనిపించడం లేదు. చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలమనేరులో రాత్రి ఉష్ణోగ్రత 17 డిగ్రీల లోపే ఉంటోంది. బైరెడ్డిపల్లె, వి.కోట, బంగారుపాళ్యం ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలు. శాంతిపురంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 14 డిగ్రీలు కాగా.. చిత్తూరు, గుడిపాల, పూతలపట్టు, జీడీనెల్లూరు, తవణంపల్లె ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలుగా నమోదవుతోంది. నగరి, కార్వేటినగరం ప్రాంతాల్లో 20 డిగ్రీలు నమోదవుతోంది. దీనికితోడు అర్ధరాత్రి దాటాక పొగమంచు దట్టంగా వ్యాపించడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కొన్ని మార్గాల్లో అసలు వాహనాలు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఉదయం ఏడు గంటలైనా కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వీడటం లేదు. చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చర్మవ్యాధులే కాకుండా శ్వాసకోశ రుగ్మతలు ఈ సీజన్‌లో ఎక్కువ. ప్రజలు చలిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని