logo

సిరులతల్లికి స్వర్ణ శోభ

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారు శుక్రవారం ఉదయం సర్వభూపాల వాహనంపై ఊరేగారు. వాహనంపై వెన్నముద్ద కృష్ణుడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 26 Nov 2022 06:08 IST

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారు శుక్రవారం ఉదయం సర్వభూపాల వాహనంపై ఊరేగారు. వాహనంపై వెన్నముద్ద కృష్ణుడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం సాయంత్రం స్వర్ణ రథోత్సవం కనులపండువగా జరిగింది. రథంపై శ్రీమహాలక్ష్మి రూపంలో కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి గరుడ వాహనసేవ వేడుకగా సాగింది. శ్రీవారి పాదాలు, లక్ష్మీకాసుల హారాన్ని ధరించి అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. శనివారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనసేవలు జరగనున్నాయి. వాహనసేవలో జీయ్యంగార్లు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తితిదే పాలకమండలి సభ్యులు శ్రీరాములు, పోకల అశోక్‌కుమార్‌, జేఈవో వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని