logo

గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు

రీసర్వే పూర్తయిన 134 గ్రామాలకు సంబంధించి స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ఇకపై గ్రామ సచివాలయాల్లో చేయాలని జేసీ వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

Published : 26 Nov 2022 06:08 IST

మాట్లాడుతున్న జేసీ వెంకటేశ్వర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రీసర్వే పూర్తయిన 134 గ్రామాలకు సంబంధించి స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ఇకపై గ్రామ సచివాలయాల్లో చేయాలని జేసీ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌, సర్వేశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జేసీ మాట్లాడారు. సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌, అడ్మిన్‌ కార్యదర్శికి డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక శిక్షణ అందించాలన్నారు. జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ 50 గ్రామాల డేటాను అప్‌లోడ్‌ అయిందని, కొందరు సిబ్బందికి రిజిస్ట్రేషన్ల నిర్వహణపై శిక్షణ ఇచ్చామన్నారు. మిగతా గ్రామాల కోరిలేషన్‌, ఎల్‌పీఎం డేటా రావాల్సి ఉందన్నారు. జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, చుడా వైస్‌ ఛైర్మన్‌ విశ్వనాథ్‌, సర్వే శాఖ ఏడీ కనగప్రసాద్‌, సబ్‌ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. బ దివ్యాంగులకు మోటారు వాహనాల పంపిణీ కోసం ఈ నెల 29న ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని జేసీ వెంకటేశ్వర్‌ కోరారు. జిల్లాకు 70 వాహనాలు మంజూరయ్యాయని.. ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాలు కేటాయించనున్నట్లు తెలిపారు. వాహనాల కోసం మొత్తం 198 దరఖాస్తులు వచ్చాయని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. లబ్ధిదారుల్లో ఒక్కో నియోజకవర్గంలో ఐదుగురు మహిళలు ఉండాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఇద్దరు ఆర్థో డాక్టర్లు, ఒక ఎంవీఐ ఉండేలా చూడాలన్నారు. డిసెంబరు 3న దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల శాఖ ఏడీ శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ తులసి, ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని