logo

అరచేతిలో వరసిద్ధుడి ఆలయ ఆర్జిత సేవలు

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయానికి సంబంధించిన సేవ, ఆర్జిత సేవ, దర్శన టిక్కెట్లను ఎక్కడి నుంచైనా పొందే సౌలభ్యాన్ని ఆలయ అధికారులు తీసుకొచ్చారు.

Updated : 26 Nov 2022 06:40 IST

కొత్త వెబ్‌సైట్‌ ద్వారా భక్తులకు అందుబాటులోకి

కాణిపాకం, న్యూస్‌టుడే: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయానికి సంబంధించిన సేవ, ఆర్జిత సేవ, దర్శన టిక్కెట్లను ఎక్కడి నుంచైనా పొందే సౌలభ్యాన్ని ఆలయ అధికారులు తీసుకొచ్చారు. ఇందుకు నూతన వెబ్‌సైట్‌ రూపొందించారు. దీంతో స్వామివారి సేవా టిక్కెట్లు అరచేతిలో పొందే అవకాశాన్ని కల్పించారు.ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తారు. ఇందులో చాలామంది ఆర్జిత, ఇరత సేవల్లో పాల్గొంటున్నారు. గతంలో ఆర్జిత సేవల్లో పాల్గొనాలంటే నేరుగా వచ్చి టిక్కెట్లు పొందాల్సిన పరిస్థితి. భక్తులు తమకు కావాల్సిన సేవలు పొందటానికి  www. srikanipakadevasthanam.org వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. అన్ని సేవలతో పాటు పరోక్ష సేవలు వీక్షించే అవకాశం కల్పించారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ను పొందుపరిచారు. ఈ కొత్త వెబ్‌సైట్‌ను ఆగస్టు 21న దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ప్రారంభించినా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

ప్రత్యక్ష, పరోక్ష సేవలు..

వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవలు బుక్‌ చేసుకోవచ్చు. ప్రత్యక్ష సేవల్లో భాగంగా సుప్రభాతం, గణపతిహోమం, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, కల్యాణోత్సవం, మహాహారతి, సంకటహర గణపతివ్రతం టిక్కెట్లు 30శాతం అందుబాటులో ఉంటాయి. పరోక్ష సేవల్లో(వర్చువల్‌) భాగంగా గణపతిహోమం, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, సంకటహర గణపతివ్రతం, కల్యాణ్సోత్స వాలు అందుబాటులోకి తెచ్చారు.  

రానున్న రోజుల్లో మరిన్ని..

రానున్న రోజుల్లో అనుబంధ ఆలయాల సేవలు, వసతిగృహాలు, దర్శన టికెట్లు, ఈ-హుండీ అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యూలైన్ల ద్వారా వెళ్లే పనిలేకుండా ఆన్‌లైన్‌ టిక్కెట్లు పొంది నేరుగా దర్శనానికి వచ్చే వీలుంది. అనుబంధ ఆలయాల్లో చండీహోమం, సత్యనారాయణ వ్రతం, సుదర్శన హోమం, రాహుకేతు పూజలు అందుబాటులోకి వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు