logo

లోకేశ్‌ దృష్టికి సర్పంచుల సమస్యలు

కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన తెదేపా సర్పంచులు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను శుక్రవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీల్లో నిధుల కొరత వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు

Published : 26 Nov 2022 06:16 IST

లోకేశ్‌కు వినతిపత్రం అందజేస్తున్నసర్పంచులు జనార్దన్‌రెడ్డి తదితరులు

కుప్పం, న్యూస్‌టుడే: కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన తెదేపా సర్పంచులు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను శుక్రవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీల్లో నిధుల కొరత వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ వసతి, తాగునీటి సరఫరా మెరుగుపరచడం, వీధి దీపాల నిర్వహణకు నిధుల కొరత అవరోధంగా మారిందని వివరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో గ్రామ పంచాయతీలను ప్రభుత్వం విస్మరించిందని తెలిపారు. రహదారుల దుస్థితికి పరిష్కారం చూపలేకపోతున్నామని వినతిలో పేర్కొన్నారు. సర్పంచుల సమస్యలు, నిధుల కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని లోకేశ్‌ను కోరినట్లు సర్పంచులు ఎద్దులింటి జనార్దన్‌రెడ్డి, మంజునాథరెడ్డి, యల్లప్ప, సంతోష్‌ తదితరులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని