logo

‘అవకాశమిస్తే సర్వనాశనం చేశారు’

‘ఒక్క ఛాన్స్‌ పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. అన్నీ రంగాల వారి నెత్తిన చేయి పెట్టి పాతాళానికి తొక్కేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని’ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 27 Nov 2022 04:21 IST

నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, తెదేపా శ్రేణులు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: ‘ఒక్క ఛాన్స్‌ పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. అన్నీ రంగాల వారి నెత్తిన చేయి పెట్టి పాతాళానికి తొక్కేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని’ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపం జాతీయ రహదారి వద్ద ఆక్వా పరిశ్రమ ప్రాంతంలో చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తిరుపతి, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల అధ్యక్షులు జి.నరసింహయాదవ్‌, అబ్దుల్‌ అజీజ్‌, తెదేపా రాష్ట్ర రైతు అధ్యక్షుడు మర్రిరెడ్డి శ్రీనివాసులరెడ్డిలతో కలిసి ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పించి మాట్లాడారు. ఆక్వాకల్చర్‌ ద్వారా చేసే ఉత్పత్తిలో భారతదేశం ప్రథమస్థానంలో ఉందని, అలాంటిది ఏపీలో ఈ సాగును దారుణంగా మార్చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఆక్వాజోన్‌, నాన్‌ ఆక్వాజోన్‌లు విభజించడంలో అవకతవకలు చేశారని, ప్రభుత్వ జోన్‌లో రూ.1.50, జోన్‌ కిందకు రాని వారికి రూ.4.50 చొప్పున యూనిట్‌కు విద్యుత్తు ధరలు నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్‌ రైతు అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, తిరుపతి పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు కృష్ణయాదవ్‌, చెంచురామయ్య, గుండాల లీలావతి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లురాజు, శ్రీపతిబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని