logo

సూర్యచంద్రుల తోడు.. అమ్మ తేజస్సు చూడు

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి శనివారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ జరిగింది. వాహనంపై అమ్మవారు శ్రీసూర్యనారాయణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 27 Nov 2022 04:21 IST

సూర్య, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరిన అమ్మవారు

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి శనివారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ జరిగింది. వాహనంపై అమ్మవారు శ్రీసూర్యనారాయణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తితిదే నూతనంగా తయారు చేసిన బంగారు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరారు. రాత్రి అమ్మవారికి చంద్రప్రభ వాహనసేవ జరిగింది. వాహనంపై అమ్మవారు వెన్నముద్ద కృష్ణుడు అలంకరణలో దర్శనమిచ్చారు.  ఆదివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనసేవలు జరగనున్నాయి. వాహనసేవల్లో జీయ్యంగార్లు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, శ్రీరాములు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్‌ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


సర్వదర్శనానికి 14 గంటలు  

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. శనివారం సాయంత్రానికి ధర్మదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్‌లో వచ్చిన భక్తులకు 14 గంటల్లో దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. శుక్రవారం శ్రీవారిని 60,157 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 31,445 మంది తలనీలాలు సమర్పించారు. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. గదులు దొరక్క కొంతమంది తితిదే షెడ్లలో సేదదీరారు. చలితీవ్రత ఎక్కువగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని