logo

31,777 మంది రైతులకు సున్నావడ్డీ

సున్నావడ్డీ పథకం కింద జిల్లాలోని 31,777 మంది రైతులకు రూ.8.47 కోట్లు మంజూరయ్యాయని ఇన్‌ఛార్జి జేడీఏ రత్నప్రసాద్‌ శనివారం తెలిపారు.

Published : 27 Nov 2022 04:21 IST

చిత్తూరు(వ్యవసాయం): సున్నావడ్డీ పథకం కింద జిల్లాలోని 31,777 మంది రైతులకు రూ.8.47 కోట్లు మంజూరయ్యాయని ఇన్‌ఛార్జి జేడీఏ రత్నప్రసాద్‌ శనివారం తెలిపారు. 2020 రబీ, 2021 ఖరీఫ్‌ సీజన్లకు సంబంధించి పంట రుణాలను బ్యాంకులకు సకాలంలో చెల్లించిన రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. ఇప్పటికే సున్నావడ్డీ రైతుల జాబితాను ఆర్‌బీకేల్లో ప్రదర్శించామని, అర్హులైనప్పటికీ.. జాబితాలో పేర్లులేని రైతులు ఆర్‌బీకే సహాయకులకు బ్యాంకు అధికారుల ధ్రువపత్రాన్ని సమర్పించాలన్నారు. గతేడాది నవంబరులో అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వివిధ కారణాలతో పరిహారం అందని 1,277 మంది రైతులకు రూ.56.99 లక్షలు మంజురయ్యాయన్నారు. సున్నావడ్డీ, పంట నష్టపరిహారం నగదు ఈ నెల 28న రైతుల ఖాతాలకు జమ కానున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని