logo

31,777 మంది రైతులకు రూ.8.47 కోట్ల జమ

వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా జిల్లాలోని 31,777 మంది రైతుల ఖాతాల్లోకి రూ.8.47 కోట్ల లబ్ధి జమ అయిందని జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు.

Published : 29 Nov 2022 02:16 IST

మెగా చెక్కును ఆవిష్కరిస్తున్న జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితరులు

చిత్తూరు కలెక్టరేట్‌: వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా జిల్లాలోని 31,777 మంది రైతుల ఖాతాల్లోకి రూ.8.47 కోట్ల లబ్ధి జమ అయిందని జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. రైతుల ఖాతాల్లోకి నగదు జమ కార్యక్రమాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లె నుంచి వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. అనంతరం జడ్పీ ఛైర్మన్‌ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. వరుసగా మూడో ఏడాదీ సున్నా వడ్డీ పంట రుణాల్ని అందించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ రూ.లక్ష లోపు రుణం తీసుకుని, సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీని ప్రభుత్వం అందిస్తోందన్నారు. దీంతోపాటు పంట నష్ట పరిహారం కింద 1,277 మంది రైతులకు రూ.56.99 లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, మేయర్‌ అముద, డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ రామచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని