logo

‘చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్టు చేయాలి’

తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా నేతలు చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.

Published : 29 Nov 2022 02:16 IST

ఎస్సైకి ఫిర్యాదు అందిస్తున్ననాని, రాజసింహులు తదితరులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా నేతలు చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. అతడి వ్యాఖ్యలు దారుణమని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని నాని, రాజసింహులు పేర్కొన్నారు. అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, నాయకులు మోహన్‌రాజ్‌, రాజశేఖర్‌, చంద్రమోహన్‌, సీఎం విజయ, వరలక్ష్మి, రాణి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని