ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు
వైకాపా పాలనలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రారంభించేందుకు తెదేపా శ్రేణులు సన్నద్ధమయ్యాయి.
నేటి నుంచి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం
45 రోజుల పాటు ఇంటింటికీ తెదేపా శ్రేణులు
ప్రచారపత్రాలు ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి తదితరులు
కుప్పం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రారంభించేందుకు తెదేపా శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఆయా మండలాల్లో గురువారం సమావేశాలను నిర్వహించిన నాయకులు.. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ ప్రచార పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
నియోజకవర్గ ఇన్ఛార్జుల ఆధ్వర్యంలో
ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థ పాలన, హామీల విస్మరణ తదితరాల వల్ల ప్రజలకు ఎదురవుతున్న కష్టనష్టాలను జనానికి గుర్తు చేసే విధంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని విస్త్రృతంగా నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి 45 రోజుల పాటు తెదేపా శ్రేణులు జనంలో ఉండే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మండల పార్టీ బాధ్యులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జిలు, మండల, పంచాయతీ స్థాయి కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు భాగస్వాములు కానున్నారు.
ప్రజల నుంచి మిస్డ్‌కాల్ కార్యక్రమం
గ్రామాలు, వార్డుల్లో చేపట్టనున్న ఇదేం ఖర్మ కార్యక్రమం సందర్భంలో ప్రజల నుంచి చరవాణి నంబరు 91-92612 92612కు మిస్డ్‌కాల్ ఇచ్చే విధంగా సరికొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే క్రమంలో.. వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు మిస్డ్‌కాల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు గ్రామ పర్యటనలను చేపట్టే విధంగా కార్యాచరణను అమలు చేస్తారు.
కుప్పంలో పాల్గొననున్న చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో జరిగే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని నేతలు తెలిపారు. ఈ నెల 7 నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు మొదటి రోజున శాంతిపురం మండలంలో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు.
14 అంశాలపై అభిప్రాయ సేకరణ
‘ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని బాధించే అంశాలు ఏవి?’ శీర్షికన పార్టీ తరఫున ప్రత్యేకంగా ముద్రించిన అభిప్రాయ సేకరణ పత్రాల్లో 14 అంశాలను పొందుపరచి.. వాటిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. నిరుద్యోగ సమస్య, నిత్యావసరాల ధరల భారం, మద్యపాన నిషేధం, ఇసుక మాఫియా, అవినీతి, విద్యుత్తు, రోడ్ల దుస్థితి, నిధుల దుర్వినియోగం, రాజధాని రాజకీయాలు, నిలకడ లేని పాలన తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇంటింటా ప్రజలను కలుసుకొంటూ.. అభిప్రాయాలను పత్రాల్లో పొందుపరచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ