logo

తాళికట్టు శుభవేళా..

జిల్లాలో ప్రస్తుతం శుభ వేడుకల సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం మార్గశిర మాసం నడుస్తోంది.

Published : 03 Dec 2022 01:52 IST

ఈ నెల 18 వరకు ముహూర్తాలు

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రస్తుతం శుభ వేడుకల సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం మార్గశిర మాసం నడుస్తోంది. ఈ నెలలో 18 వరకు ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, కొత్త ఇళ్ల భూమిపూజ.. ఇలా ఇంటిలో ఓ శుభకార్యం జరిపేందుకు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు ప్రజలు. డిసెంబరు 2న మంచి ముహూర్తం కావడంతో చాలా పెళ్లిళ్లు జరిగాయి. ఇంకా 3, 4, 7, 8, 9, 14, 16, 17, 18 తేదీల్లోనూ ముహూర్తాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో వెయ్యి వరకు వివాహాలు జరగనున్నట్లు అంచనా. పుష్యమాసం డిసెంబరు 24 నుంచి జనవరి 21 వరకు ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. మంచి ముహూర్తం.. మించిన దొరకదు అన్నట్లు శుభ వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లిళ్ల నేపథ్యంలో పురోహితులకు డిమాండ్‌ ఏర్పడింది. ఇంకా కల్యాణ మండపాలు, కేటరింగ్‌, పుష్పాలం కరణ.. అనుబంధ రంగాల వారీగా జోరుగా వ్యాపారం సాగుతోంది.

అనువైన సమయం..

ఈ నెలలో 18 వరకు శుభకార్యాల నిర్వహణకు ముహూర్త బలమున్న కాలం. పుష్య మాసంలో శుభకార్యాలు చేయరు. ఆ తర్వాత మాఘ మాసంలోనే పెళ్లిళ్లకు అనువైన సమయం.

వేణుగోపాల్‌, అర్చకులు, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని