logo

ఆలయ పునర్నిర్మాణానికి సర్వం సిద్ధం

తిరుపతి గ్రామ దేవత శ్రీతాతయ్యగుంట గంగమ్మ బాలాలయ స్థాపన శనివారం జరగనుంది.

Published : 03 Dec 2022 01:52 IST

తాతయ్యగుంట గంగమ్మ పునర్దర్శనం ఏప్రిల్‌ లోనే..
నేడు బాలాలయ స్థాపన

మంగళం (తిరుపతి), న్యూస్‌టుడే: తిరుపతి గ్రామ దేవత శ్రీతాతయ్యగుంట గంగమ్మ బాలాలయ స్థాపన శనివారం జరగనుంది. భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనం శనివారం నుంచి నిలిపివేయనున్నారు. నిర్మాణ పనులు పూర్తిచేసుకుని 2023 ఏప్రిల్‌ 10న జరిగే కుంభాభిషేకంతో అమ్మవారు పునర్దర్శనం ఇవ్వనున్నారు. అప్పటివరకు ఆలయ ప్రాంగణంలోని కొడిస్తంభం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయంలోని అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని ఆలయ పాలకవర్గం ప్రకటించింది. ఆలయ నిర్మాణ పనులకు దాతలు, భక్తులు, తితిదే నుంచి నిధులు సమకూర్చుకున్నారు. తితిదే రూ.3.75 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. రూ.9.25 కోట్లను భక్తులు, దాతల నుంచి ఆలయ పాలకవర్గం సేకరించింది. మొత్తంగా రూ.12 కోట్లతో ఆలయాన్ని నిర్మించనున్నట్టు శాసనసభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని