logo

ప్రత్యేక వ్యూహాలతో ఎర్రచందనం సంరక్షణ

శేషాచలం అడవుల్లో అరుదైన ఎర్రచందనం వృక్షాలను స్మగ్లర్ల నుంచి రక్షించేందుకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తామని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కె.చక్రవర్తి తెలిపారు.

Published : 03 Dec 2022 01:52 IST

ఏపీ టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా చక్రవర్తి బాధ్యతలు

బాధ్యతలు చేపడుతున్న చక్రవర్తి

జీవకోన (తిరుపతి), న్యూస్‌టుడే: శేషాచలం అడవుల్లో అరుదైన ఎర్రచందనం వృక్షాలను స్మగ్లర్ల నుంచి రక్షించేందుకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తామని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కె.చక్రవర్తి తెలిపారు. శుక్రవారం కపిలతీర్థంలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో ఇదివరకు ఎస్పీగా పనిచేసిన మేడా సుందరరావు నుంచి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ స్మగ్లర్లను అణచి వేసేందుకు శాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌, అటవీశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి దాడులు ముమ్మరం చేస్తామన్నారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని