logo

శాస్త్రోక్తంగా చొక్కాని ఉత్సవం

తమిళ కార్తికం, కృత్తికా నక్షత్రం రోజును పురస్కరించుకుని నిర్వహించిన చొక్కాణి ఉత్సవం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది.

Updated : 07 Dec 2022 05:22 IST

ఊరేగింపులో శ్రీవిశాఖ  శారదాపీఠం ఉత్తరాధికారి  శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తమిళ కార్తికం, కృత్తికా నక్షత్రం రోజును పురస్కరించుకుని నిర్వహించిన చొక్కాణి ఉత్సవం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ ఆవరణలోని నగరికుమారుల మండపం వద్ద చొక్కాని మానును ఏర్పాటు చేసి అగ్నికి ఆహుతి చేశారు. ఆలయ అనువంశీక ప్రధాన దీక్షా గురుకుల్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో సంకల్పపూజలు జరిగాయి. శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ఉత్సవమూర్తులకు తొలుత విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తాళవృక్షాలను అగ్నికి ఆహుతి చేశారు. శ్రీవిశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి, ఆలయ ఛైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో కె.వి.సాగర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


నేడు కార్తిక పర్వ దీపోత్సవం

తిరుమల: శ్రీవారి ఆలయంలో బుధవారం సాలకట్ల కార్తిక దీపోత్సవాన్ని తితిదే ఘనంగా నిర్వహించనుంది.  ఆలయం అంతటా, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామిపుష్కరిణి వద్ద దీపాలు ఏర్పాటు చేస్తారు.  గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరుగనుంది.


సర్వదర్శనానికి ఆరు గంటలు    

తిరుమల: మంగళవారం సాయంత్రానికి శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్లలోకి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు ఆరు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. సోమవారం శ్రీవారిని 66,020 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.37 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని