logo

అంబేడ్కర్‌కు పూలమాలలు వేయనివ్వలేదని నిరసన

అంబేడ్కర్‌ విగ్రహానికి పోలీసులు పూలమాలలు వేయనివ్వలేదని దళిత మహిళలు మంగళవారం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.  

Published : 07 Dec 2022 01:32 IST

రామకుప్పం, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విగ్రహానికి పోలీసులు పూలమాలలు వేయనివ్వలేదని దళిత మహిళలు మంగళవారం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.  రామకుప్పం శివాజీనగర్‌ కాలనీ వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అంబేడ్కర్‌ విగ్రహాలను గతంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. మంగళవారం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు పోలీసుల అనుమతి కోరారు.  నిరాకరించడంతో వారు రెవెన్యూ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తహసీల్దారు లేకపోవడంతో నివాళులర్పించేందుకు అనుమతించాలని గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసేందుకు యత్నించగా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు విగ్రహాల వద్దకు ఎవరూ రాకూడదని హెచ్చరించారు. శివాజీనగర్‌ క్రాస్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, దళిత మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రామకుప్పం-కుప్పం రహదారిపై దళిత మహిళలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించక పోవడంపై నిరసన తీవ్ర స్థాయితో చేపట్టారు. పక్కనే ఉన్న ద్విచక్ర వాహనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పోలీసులు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని