logo

ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి

ప్రభుత్వ శాఖల్లోని ప్రతి ఉద్యోగికీ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరని ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరు నమోదు చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు.

Published : 19 Jan 2023 05:52 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ శాఖల్లోని ప్రతి ఉద్యోగికీ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరని ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరు నమోదు చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. ‘ఉద్యోగులు కచ్చితంగా ముఖ హాజరు వేసేలా విభాగాధిపతులు చర్యలు చేపట్టాలన్నారు. స్పందన అర్జీలను.. ఏపీ సేవా, మీసేవ దరఖాస్తుల్ని వెంటనే పరిష్కరించాలి. బాల్య వివాహాల నియంత్రణకు ఆర్‌డీవోలు క్షేత్రస్థాయిలో కృషిచేయాలని’ పేర్కొన్నారు. జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్‌వో రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

వ్రిద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘బడి బయట పిల్లల్ని గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి. ఆ విద్యార్థికి ఉపాధ్యాయుణ్ని అనుసంధానం చేసి బ్రిడ్జ్‌ కోర్సులో శిక్షణనివ్వాలని’ పేర్కొన్నారు. డీఈవో విజయేంద్రరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

ల్రాభాలను అందిస్తోన్న పట్టు పరిశ్రమలకు ప్రోత్సాహం నిమిత్తం మరిన్ని చాకీ కేంద్రాల్ని నెలకొల్పాలని కలెక్టర్‌ అన్నారు. ఉద్యానశాఖ సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ మామిడి, టమోటాకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు.
* ప్రజారోగ్యం కోసం వైద్యఆరోగ్య, ఐసీడీఎస్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. గర్భిణులు, పిల్లల్లో రక్తహీనతను గుర్తించి పోషకాహారం అందించాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రకాశం, డీఐవో రవిరాజు, డీసీహెచ్‌ఎస్‌ నాయక్‌, ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ పాల్గొన్నారు. సంచార అంబులెన్స్‌ ద్వారా పశువులకు వైద్యసాయం అందించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని