ప్రజాభిప్రాయ సేకరణకు స్పందన కరవు
విద్యుత్తు టారీఫ్ ప్రతిపాదనలపై ఆ శాఖ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు మొదటిరోజు వినియోగదారుల నుంచి స్పందన కరువైంది.
సమావేశంలో పాల్గొన్న విద్యుత్తు శాఖ ఈఈలు హరి, పద్మనాభపిళ్లై
చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే : విద్యుత్తు టారీఫ్ ప్రతిపాదనలపై ఆ శాఖ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు మొదటిరోజు వినియోగదారుల నుంచి స్పందన కరువైంది. గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయసేకరణను ఆ శాఖ ఉన్నతాధికారులు సర్కిల్ పరిధిలో ఎస్ఈ, ఈఈ కార్యాలయాల్లో చేపట్టారు. చిత్తూరు అర్బన్, రూరల్ డివిజన్లకు సంబంధించి రూరల్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి ఒక్క వినియోగదారుడు హాజరు కాలేదని రూరల్ డివిజన్ ఈఈ హరి తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయం, వ్యయం, టారీఫ్ పెరుగుదల అంచనాలను అధికారులు తెలియజేస్తారు. దీనిపై విద్యుత్తు ఆవశ్యకత, ఛార్జీల ప్రతిపాదనలు, నాణ్యమైన సరఫరా, పొదుపు, ఛార్జీల తగ్గింపు తదితర అంశాలపై వినియోగదారులు తమ అభిప్రాయాలు తెలియచేయవచ్చు. ఏ ఒక్క వినియోగదారుడు హాజరుకాకపోవడంతో ప్రజాభిప్రాయ సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆ శాఖ అధికారులు విఫలమయ్యారు. ఈ సమావేశానికి ఎవరు హాజరు కావచ్చు.? ఎక్కడ పేరు నమోదుచేసుకోవాలి..? ఎలాంటి అంశాలు ప్రస్తావించవచ్చు.? తదితర వివరాలను వినియోగదారులకు తెలియజేయాల్సిన ఆ శాఖ అధికారులు తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అర్బన్ డివిజన్ ఈఈ పద్మనాభపిళ్లై, డీఈ శేషాద్రిరెడ్డి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: వలస కూలీగా సర్పంచి
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Movies News
Vani jayaram: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం