logo

‘లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు’

లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెదేపా నేతలు హెచ్చరించారు.

Published : 23 Jan 2023 04:18 IST

కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌

రామకుప్పం, న్యూస్‌టుడే: లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెదేపా నేతలు హెచ్చరించారు. ఆదివారం మండలం శివారులోని శ్రీవళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రాంగణంలో యువనేత నారా లోకేశ్‌ పాదయాత్ర ఏర్పాట్లపై చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌, మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి, తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంటామనడం సబబుకాదన్నారు. గతంలో జగన్‌, షర్మిల పాదయాత్రలకు అప్పటి తెదేపా ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే కాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కల్పించినట్లు తెలిపారు. లోకేశ్‌ పాదయాత్రను విజయవంతం చేయాలని నాయకులను కోరారు. కార్యక్రమంలో చలపతి, చిన్నికృష్ణ, గంట్లగౌడు, శ్రీనివాసులురెడ్డి, రామ్మూరి, నరసింహులు, జయశంకర్‌, కృష్ణానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు