logo

రెండు కార్లు ఢీ: ఇద్దరి మృతి

చిత్తూరు పలమనేరు జాతీయరహదారిపై కేజీ సత్రం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.

Published : 27 Jan 2023 02:35 IST

ప్రమాదంలో దెబ్బతిన్న కారు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: చిత్తూరు పలమనేరు జాతీయరహదారిపై కేజీ సత్రం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎఎస్సై మలప్ప కథనం మేరకు.. చిత్తూరు వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారుకు ఆవు అడ్డు రావడంతో తప్పించబోయి పక్కకు తిప్పడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక కారులో వెళ్తున్న పుత్తూరు దెయ్యల గుంటకు చెందిన కారు డ్రైవర్‌ మనన్‌(50) ఘటనా స్థలంలో మృతి చెందగా పుత్తూరు ఆర్టీసీ కాలనీకి చెందిన ప్రేమ(60) చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె భర్త రాధాపతి, మరో కారులో వెళ్తున్న తమిళనాడు రాష్ట్రం కళ్లవ్వకుర్చి గ్రామానికి చెందిన గోకుల్‌(32)లకు తీవ్రగాయాలు కావడంతో చిత్తూరు వైద్యశాలలో ప్రథమ చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్య కోసం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. సీఐ నరసింహారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ప్రమాదంలో వ్యక్తి..

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణానికి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద బైపాస్‌ మార్గంలో కారు ఢీకొని ద్విచక్రవాహనం నడుపుతున్న వినోద్‌కుమార్‌(30) అనే వ్యక్తి గురువారం మృతిచెందాడు. ఐరాల మండలం కామినేపల్లె నుంచి బెంగళూరుకు వెళుతుంటే వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇతను సొంత గ్రామానికి వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని