logo

సరస్వతీ నమస్తుభ్యం...

వసంత పంచమి సందర్భంగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 27 Jan 2023 02:35 IST

సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్న తల్లిదండ్రులు

కాణిపాకం, న్యూస్‌టుడే: వసంత పంచమి సందర్భంగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో సరస్వతీ అమ్మవారి విగ్రహాన్ని సర్వాలంకృతులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 541 మంది పిల్లలతో వారి తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని