logo

సవాళ్లను స్వీకరించి సత్తా చాటుదాం

ఈ ఏడాదిలో పెను సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాలని, వాటిని అధిగమించి సత్తాచాటేందుకు అందరూ కలసికట్టుగా, అంకితభావంతో పనిచేయాలని షార్‌ సంచాలకులు ఆర్ముగం రాజరాజన్‌ అన్నారు.

Published : 27 Jan 2023 02:35 IST

షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌

జెండా వందనం చేస్తున్న సంచాలకులు రాజరాజన్‌, కమాండెంట్‌ రేఖా నంబియార్‌

శ్రీహరికోట, న్యూస్‌టుడే: ఈ ఏడాదిలో పెను సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాలని, వాటిని అధిగమించి సత్తాచాటేందుకు అందరూ కలసికట్టుగా, అంకితభావంతో పనిచేయాలని షార్‌ సంచాలకులు ఆర్ముగం రాజరాజన్‌ అన్నారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ పాఠశాల మైదానంలో గురువారం 74వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయజెండాను ఎగురవేసి, కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఇస్రో సాధించిన మైలురాళ్లను ప్రస్తావిస్తూ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ దళాల్లో స్ఫూర్తినింపారు. సీనియర్‌ కమాండెంట్‌ రేఖా నంబియార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంఎన్‌ లక్ష్మీనరసింహస్వామిలు పోలీసు విశిష్ఠ పతకాలకు ఎంపిక కావడంపై వారిని అభినందించారు. ఎంఎస్‌జీ గ్రూపు డైరెక్టర్‌ గోపీకృష్ణ, హెడ్‌ రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని