logo

ఆలయాల్లో చోరీ నిందితుల అరెస్టు

ఆలయాల్లో దొంగతనాలు చేసే నలుగురు నిందితులను క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ విమలకుమారి తెలిపారు.

Updated : 27 Jan 2023 05:05 IST

వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీ విమలకుమారి తదితరులు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: ఆలయాల్లో దొంగతనాలు చేసే నలుగురు నిందితులను క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ విమలకుమారి తెలిపారు. గురువారం తిరుపతి క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి.. వారి వివరాలు తెలిపారు. ‘పేరూరు వకుళమాత ఆలయంలో జరిగిన దొంగతనంపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయి. గురువారం తిరుపతి- చంద్రగిరి మార్గంలోని కాలూరు క్రాస్‌ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం మమ్మయిలకుండలిపల్లికి చెందిన ఎన్‌.గంగరాజు, అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్‌ కట్టివారిపల్లికి చెందిన జి.రెడ్డెప్ప, దేవళంపల్లికి చెందిన పి.నరసింహులు, కలికిరి మండలం గుట్టపాలెంకు చెందిన ఎ.కిరణ్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వకుళమాత ఆలయంలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. గతంలో రేణిగుంట గంగమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డారని.. వీరిపై పలు కేసులు నమోదై ఉన్నాయి’ అని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ సురేష్‌, సీఐలు చిరంజీవి, శ్రీనివాసులు, చల్లనిదొర, ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ సుమతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని