logo

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం

జిల్లా అభివృద్ధి పథంలో ముందుకెళుతోందని.. పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 02:35 IST

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

 


జాతీయజెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి.

చిత్రంలో ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ బాలాజీ, డీఆర్వో శ్రీనివాసరావు, ఏఏస్పీలు

తిరుపతి(కలెక్టరేట్‌): జిల్లా అభివృద్ధి పథంలో ముందుకెళుతోందని.. పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతి పోలీసు పరేడ్‌ మైదానంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం ప్రసంగిస్తూ... ‘తిరుపతి జిల్లా ఆవిర్భావం నుంచి అన్నిశాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత క్ష్రేతస్థాయిలో ప్రజలకు న్యాయం జరుగుతోంది’ అని తెలిపారు. ‘శాంతి భద్రతలే ధ్యేయంగా జిల్లా పోలీసు యంత్రాంగం పని చేస్తోంది. వారి పనితీరు కారణంగా ఏడాది కాలంలో 25 శాతం నేరాలు తగ్గాయి. యువకులకు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న ఎస్పీ పరమేశ్వరరెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు’ అని అన్నారు. అనంతరం స్వాత్రంత్య సమరయోధుడు సుబ్రహ్మణ్యంరెడ్డి కుమారుడు యాదేశ్వర్‌రెడ్డిని కలెక్టర్‌ సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

పలు శాఖలు ఏర్పాటు చేసిన ప్రగతి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాడు-నేడు మనబడి, నీటి యాజమాన్య సంస్థ, జగనన్న గృహాలు శకటాలకు బహుమతులు లభించాయి.

పోలీసు జాగిలాల ప్రదర్శన వీక్షకులను ఆకర్షించింది. కార్యక్రమంలో జేసీ బాలాజీ, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, డీఆర్వో శ్రీనివాసరావు, తిరుపతి, గూడూరు ఆర్డీవోలు కనకనరసారెడ్డి, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌, ఎస్పీలు

పరేడ్‌లో సాయుధ బలగాల ప్రదర్శన

అగ్నిమాపక సిబ్బంది ఏర్పాటు చేసిన రంగునీటితో త్రివర్ణ నమూనా


విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ప్రదర్శన

తిరుపతి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని