logo

జిల్లా శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర బృందం

జిల్లా శిక్షణ కేంద్రాన్ని శనివారం కేంద్ర బృందం సభ్యులు శశికుమార్‌సాహు, సత్యబ్రత్‌మెహ్రా సందర్శించారు.

Published : 29 Jan 2023 04:45 IST

డెయిరీ పరికరాలను పరిశీలిస్తున్న బృందం

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే : జిల్లా శిక్షణ కేంద్రాన్ని శనివారం కేంద్ర బృందం సభ్యులు శశికుమార్‌సాహు, సత్యబ్రత్‌మెహ్రా సందర్శించారు. సీడాప్‌, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధితో కూడిన నైపుణ్య శిక్షణ అందిస్తున్న దీనదయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయుజీకేవై) పథకం అమలు తీరును పరిశీలించారు. సీడాప్‌ రిటైల్‌ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడ శిక్షణ పొందుతున్న యువతతో ముఖాముఖి మాట్లాడి వివరాలు రాబట్టారు. డొమైన్‌ రీటైల్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, వసతి గదులు, పాల శీతలీకరణ యంత్రాలు పరిశీలించారు. వారి వెంట డీఆర్‌డీఏ పీడీ తులసి, జాబ్స్‌ జిల్లా మేనేజర్‌ సరితారెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని