logo

‘అచ్చెన్నాయుడుది దిగజారుడు రాజకీయం’

పోలీసులను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అమర్యాదగా మాట్లాడడం సరికాదని జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు మురళి అన్నారు.

Updated : 29 Jan 2023 05:58 IST

మాట్లాడుతున్న జిల్లా పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉదయ్‌

చిత్తూరు గ్రామీణ : పోలీసులను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అమర్యాదగా మాట్లాడడం సరికాదని జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు మురళి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా అచ్చెన్నాయుడు పోలీసు శాఖ తీరుపై అనుచిత వ్యాఖలు చేయడం దిగజారుడు రాజకీయమన్నారు. సంస్కారంతో మాట్లాడాలని హెచ్చరించారు. సంఘం సభ్యులు మునిరాజులు, వేణు, సుదర్శన్‌ పాల్గొన్నారు. తెదేపా నేత విజ్ఞత మరచి పోలీసు వ్యవస్థపై ఆరోపణలు చేయడం సరికాదని జిల్లా పోలీసు యూనియన్‌ అధ్యక్షుడు ఉదయ్‌ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ పోలీసులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారన్నారు. 700 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నా.. సభ్యత, సంస్కారం మరచి.. పోలీసు వ్యవస్థపై దిగజారుడు మాటలు అనడం మంచిది కాదన్నారు. వ్యాఖ్యల్ని వెనక్కితీసుకొని, క్షమాపణ చెప్పాలన్నారు. ఖాదర్‌భాషా, శరవరణ, రమేష్‌ పాల్గొన్నారు.


ఎస్పీకి ఫిర్యాదు..

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని పోలీసు సంఘం అధ్యక్షుడు ఉదయ్‌, సంఘం నాయకులు, పోలీసులు ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. లోకేష్‌ పాదయాత్రకు 500 మంది పోలీసులతో భద్రత కల్పించామని చెప్పటంపై అచ్చెన్నాయుడు అసభ్యకరమైన పదజాలాన్ని వాడారని మండిపడ్డారు. దీనిపై ఎస్పీ రిషాంత్‌రెడ్డి స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు సరికావని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని