logo

ఆలస్యమైనా.. విరబూత

ఈ ఏడు అధిక వర్షాలతో మామిడి పూత ఆలస్యమైంది. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా మంచు ప్రభావం చూపుతోంది. దీంతో మామిడి రైతులు దిగాలు చెందారు.

Published : 29 Jan 2023 04:45 IST

పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లెలో చెట్టు నిండా పూత

ఈ ఏడు అధిక వర్షాలతో మామిడి పూత ఆలస్యమైంది. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా మంచు ప్రభావం చూపుతోంది. దీంతో మామిడి రైతులు దిగాలు చెందారు. అయితే అందుకు భిన్నంగా పూత వచ్చి రైతుల్లో ఆశలు రేపుతోంది. పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లె సమీపంలోని కర్నూలు జాతీయరహదారి పక్కనున్న ఒక మామిడి తోటలో పూత విరబూసి చూపరులను ఆకట్టుకుంటోంది. అలాగే పుత్తూరు మండలం తడుకు సమీపంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. రాకపోకలు సాగిస్తున్న రైతులు, ప్రజలు పూతను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

న్యూస్‌టుడే, పుత్తూరు, పూతలపట్టు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు