logo

వ్యవసాయ సర్వీసుల జారీలో జాప్యం ఉండదు: ఎస్‌ఈ

నగదు చెల్లించిన రైతులకు సత్వరమే వ్యవసాయ సర్వీసులు జారీ చేస్తున్నామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు.

Published : 29 Jan 2023 04:45 IST

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: నగదు చెల్లించిన రైతులకు సత్వరమే వ్యవసాయ సర్వీసులు జారీ చేస్తున్నామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఇకపై సర్వీసుల జారీలో జాప్యం ఉండే ప్రసక్తే లేదని..ప్రాధాన్యతా క్రమంలో జారీ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. గతేడాది ఆగస్టుకు ముందు నగదు చెల్లించిన రైతులకు సర్వీసులు ఇచ్చామన్నారు. చెరువుల్లో నీరు, పంటల సాగు తదితర కారణాలతో 350 కొత్త సర్వీసులకు నియంత్రికలు అమర్చడం జాప్యమవుతోందన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే తక్షణమే సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

* 100కేవీ 16, ఎనిమిది 63కేవీ నియంత్రికలు గోదాముకు చేరాయని ఎస్‌ఈ తెలిపారు. నియంత్రికలు, అనుబంధ పరికరాల కొరత లేదన్నారు. డివిజన్లకు సరఫరా చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని