logo

క్యాన్సర్‌ నివారణ, చికిత్సలకు ప్రాధాన్యమివ్వాలి

ఖర్చుతో కూడిన క్యాన్సర్‌ నివారణ, చికిత్సకు ప్రాధాన్యమిచ్చేలా  సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు.

Published : 29 Jan 2023 04:45 IST

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: ఖర్చుతో కూడిన క్యాన్సర్‌ నివారణ, చికిత్సకు ప్రాధాన్యమిచ్చేలా  సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో శనివారం తిరుపతి, చితూరు కలెక్టర్లు కె.వెంకటరమణారెడ్డి, హరినారాయణన్‌లతో సమీక్షించారు. వైద్య రంగంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యం ఉందని, జిల్లా అధికారులు, స్విమ్స్‌, టాటా క్యాన్సర్‌ ఆసుపత్రులు సంయుక్తంగా ప్రణాళికాబద్ధంగా వైద్యసేవలు అందించాలన్నారు. ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో 63 రకాల కొత్త మందులు నరసింగాపురం వద్ద ప్రారంభమవడానికి సిద్ధమవడం శుభసూచకమన్నారు. స్విమ్స్‌, టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులు చేపడుతున్న వైద్య శిబిరాలపై సీఎస్‌కు వివరించారు. క్యాన్సర్‌ పరీక్షలు చేసే పింక్‌ బస్సులు సచివాలయ స్థాయి నుంచి స్కానింగ్‌ తీసే ప్రక్రియ పరిశీలించాలన్నారు. ఐఐటీ, ఐసర్‌ సహకారంతో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఈ విధానం మరో పది రోజుల్లో రూపుదిద్దుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రారంభం కానున్న 23 కొత్త వైద్య కళాశాలల్లో ఆంకాలజీ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కార్యక్రమంలో వైద్యులు జయచంద్రారెడ్డి, రామ్‌, డాక్టర్‌ నాగశ్వరరెడ్డి, శ్రీనాథరెడ్డి, రేణు దీక్షిత, ఆర్డీవో కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని