logo

రథసప్తమికి మలయప్పస్వామి వైభవం

రథసప్తమి మహోత్సవంలో భాగంగా సప్తగిరీశుడు శనివారం ఏడు వాహనాలపై ఊరేగి అభయమిచ్చారు. తరలివచ్చిన అశేష భక్త జనం వాహనసేవలను దర్శించుకుని పునీతులయ్యారు.

Updated : 29 Jan 2023 05:56 IST

గరుడ వాహనంపై స్వామివారు

తిరుమల, న్యూస్‌టుడే: రథసప్తమి మహోత్సవంలో భాగంగా సప్తగిరీశుడు శనివారం ఏడు వాహనాలపై ఊరేగి అభయమిచ్చారు. తరలివచ్చిన అశేష భక్త జనం వాహనసేవలను దర్శించుకుని పునీతులయ్యారు.

సర్వదర్శనానికి 20 గంటలు : రథసప్తమి పర్వదినోత్సవం రోజున శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంది. శనివారం సాయంత్రానికి శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో నిండిపోయారు. నారాయణగిరిలోని ఆరు షెడ్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. శుక్రవారం శ్రీవారిని 59,695 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.06 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 30,286 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కరోనా అనంతరం మొదటిసారిగా రథసప్తమి వేడుకలను నిర్వహిస్తుండడంతో భారీగా భక్తులు తరలివచ్చారు.

నేడు స్థాయి సంఘాల సమావేశాలు

చిత్తూరు జడ్పీ: జిల్లా పరిషత్‌ ఏడు స్థాయి సంఘ సమావేశాలు ఆదివారం  నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని