అడుగడుగునా హారతులు..ఆప్యాయంగా పలకరింపులు
యువగళంలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు శనివారం గుడుపల్లె, శాంతిపురం మండలాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. వైద్య, డిగ్రీ విద్యార్థులు, చిన్నారులు, పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
యువగళం పాదయాత్రకు రెండో రోజూ జననీరాజనం
న్యూస్‌టుడే, కుప్పం, పట్టణం, గ్రామీణ, గుడుపల్లె
నలగాంపల్లెలో కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులతో కలిసి నడుస్తూ..
యువగళంలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు శనివారం గుడుపల్లె, శాంతిపురం మండలాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. వైద్య, డిగ్రీ విద్యార్థులు, చిన్నారులు, పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా చిన్నారులను ముద్దాడుతూ, పెద్దల సమస్యలను సావధానంగా వింటూ.. తెదేపా అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు.
మాదనపల్లె వద్ద రైతులతో మాట్లాడుతూ..
వెన్నంటి నడుస్తూ..
కురబ కులస్థుల సమావేశంలో కొందరు ఆయనకు గొర్రె పిల్లను బహూకరించగా.. ఆయన తన మెడపై పెట్టుకొని వారికి క్షేమంగా అప్పగించారు. నారా లోకేశ్‌ను చూసేందుకు శాంతిపురం మండలం పోడూరు వద్ద ఇద్దరు పిల్లలు బస్సు షెల్టరు ఎక్కగా, మరో పిల్లవాడు కమ్మీపై నిలబడి నారా లోకేశ్‌ను చూసి అభివాదం చేశారు. తమ గ్రామం మీదుగా వస్తున్న లోకేశ్‌కు పూల వర్షం కురిపించారు. గ్రామాల్లో పలువురు నాగళ్లను బహూకరించారు.
చంటి బిడ్డకు నామకరణం
నల్లగాంపల్లె వద్ద కుప్పానికి చెందిన రిషికేష్, అశ్విని దంపతుల మూడు నెలల చంటి బిడ్డకు సాన్విత అని లోకేశ్ నామకరణం చేశారు.
ట్రాఫిక్ క్లియర్ చేస్తూ.. 108కు దారిస్తూ..
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా సాగుతున్న పాదయాత్రకు ఎదురుగా వచ్చిన అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని లోకేశ్ చెప్పడంతో యువగళం సైనికులు ముందుకొచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. లోకేశ్‌తో కలిసి నడుస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు చొరవ తీసుకుని దారి ఇచ్చేలా చూశారు.
అన్నింటా సమస్యలు
పింఛన్ తొలగించడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం కారణంగా కుప్పం ప్రాంతంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. రాష్ట్రంలో మళ్లీ చంద్రన్న పాలన వస్తేనే పరిష్కారం అవుతాయి.
మునెమ్మ, నలగాంపల్లె మిట్ట, గుడుపల్లె మండలం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ