logo

కేంద్రం లేదు.. చేపల్లేవ్‌..

పలమనేరు: అన్ని వర్గాల చేపల పెంపకందారులకు గత ప్రభుత్వ హయాంలో రాయితీలు వచ్చేవి. ప్రస్తుతం అందులో భారీగా కోతలు విధించారు.

Published : 01 Feb 2023 04:16 IST

రాయితీల్లో కోతలు..అనంతపురానికి చేపలు

 

నిరుపయోగంగా తొట్టెలు

పలమనేరు: అన్ని వర్గాల చేపల పెంపకందారులకు గత ప్రభుత్వ హయాంలో రాయితీలు వచ్చేవి. ప్రస్తుతం అందులో భారీగా కోతలు విధించారు. గతంలో వర్షాలు లేకపోయినా చేప పిల్లలను పెంచి పంపిణీ చేసేవారు. ఈసారి భారీ వర్షాలు కురిశాయి. చెరువులు కళకళలాడుతున్నాయి. అయినా ఇటీవల ఇక్కడ ఉన్న చేప పిల్లలను అనంతపురానికి పంపేశారు. పలమనేరు మత్స్యశాఖ కార్యాలయం కళావిహీనంగా మారింది. దీని పరిధిలో పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు వస్తాయి. 47 చెరువులు 9 సొసైటీలు ఉన్నాయి. వీటి పరిధిలోని మత్స్య సహకార సంఘాలకు చేప పిల్లలు పంపిణీ చేయాలి. వారు పెంచి మత్స్యకారులకు అందజేయాలి. వారు మళ్లీ వాటిని 6 నెలల పాటు చెరువుల్లో పెంచి విక్రయిస్తారు.

ఆగిన సరఫరా

గత ప్రభుత్వంలో పరికరాలు పొందడానికి బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 90 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, బీసీలకు 40 శాతం ఇస్తున్నారు. అయినా వారికి రావాల్సిన పరికరాలు అందడం లేదు. బోట్లు, వలలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం వాటిని సరఫరా చేయలేదు. చేప పిల్లలను రాబోయే సీజన్‌ సమయానికి ఉచితంగా సరఫరా చేస్తే కొంత వరకు లాభాలు పొందే వీలుంటుంది.

లగేజీ ఆటోలున్నాయి

రాయితీ కింద ఇవ్వడానికి లగేజీ ఆటోలున్నాయి. మిగిలిన వాటిపై సబ్సిడీలు తగ్గిన మాట వాస్తవమే. ప్రస్తుతం చేపపిల్లలు, పరికరాలు ఇవ్వడానికి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నాం.
పళణి, ఇన్‌స్పెక్టర్‌ మత్స్యశాఖ కార్యాలయం, పలమనేరు
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని