logo

పదేళ్లుగా ప్రకటనలకే పరిమితం

పెనుమూరు మండలంలోని జలాశయం దిగువన ఉన్న ఖాళీ స్థలంలో చేపపిల్లల పెంపకం కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Updated : 01 Feb 2023 06:50 IST

కేటాయించిన స్థలం

పెనుమూరు, న్యూస్‌టుడే: పెనుమూరు మండలంలోని జలాశయం దిగువన ఉన్న ఖాళీ స్థలంలో చేపపిల్లల పెంపకం కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ తంతు జరిగి సుమారు పదేళ్లు దాటుతోంది. ఇక్కడ నీటి వనరులు సమృద్ధిగా ఉంటాయని భావించిన మత్స్యశాఖ అధికారులు భూమి కోసం రెవెన్యూ అధికారులకు ప్రతిపాదనలు పంపారు. అందుకు తగిన విధంగానే వారు జలాశయం వద్ద చిత్తూరు రోడ్డుకు సమీపంలోనే సుమారు రెండెకరాల భూమిని కేటాయిస్తూ సరిహద్దులు నిర్ణయించారు. రూ.5 కోట్లు అవసరమని జిల్లా అధికారులు రాష్ట్ర మత్స్యశాఖకు ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరయ్యాయని అధికారులు ప్రకటించారు. ఇక్కడ నిర్మాణాలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా కోటి చేప పిల్లలను సరఫరా చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.

ఉపాధికి మార్గం : చేప పిల్లల పెంపకం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి మార్గం చేకూరనుంది. ఇక్కడి ఉత్పత్తి చేసే చేపపిల్లలను జిల్లాలోని సాగునీటి వనరుల్లో పెంచేందుకు తరలించాలనేది ఉద్దేశం. పిల్లల పెంపకం, వాటి సరఫరాకు సిబ్బంది అవసరం ఉంటుంది. అలాగే సాగునీటి వనరుల్లో చేపలను పెంపకం, వాటి విక్రయం ద్వారా పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. ఈ విషయమై మత్స్యశాఖ చిత్తూరు డీడీ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ..పనులు ప్రారంభించేందుకు నిధులు మంజూరు కాలేదన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని