logo

సాంబారులో కాయగూరలేవీ?

పిల్లలకు వడ్డించే సాంబారులో కాయగూరలు కనిపించడం లేదని కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పుదూరు బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

Updated : 01 Feb 2023 07:21 IST

గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ప్రశ్నలు

సాంబారు పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

నాయుడుపేట, న్యూస్‌టుడే: పిల్లలకు వడ్డించే సాంబారులో కాయగూరలు కనిపించడం లేదని కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పుదూరు బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి రోజువారీ మెనూను పరిశీలించారు. సాంబరులో కాయగూరలు లేకపోవడం, కోడిగుడ్లు చిన్నవిగా ఉండటంపై నిర్వాహకులను ప్రశ్నించారు. బియ్యం నాణ్యత సరిగా లేదని, మార్చాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. బాలికలందరికీ రక్త పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ఓజిలి మండలంలోని ఆర్మేనిపాడు, చిలమాను, ఓజిలి గ్రామ సచివాలయాలను, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీఈవో శేఖర్‌, డీఎంహెచ్‌వో శ్రీహరి, సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య పాల్గొన్నారు.
* ఓజిలి వీఆర్వో శ్రీనివాసులుపై ఓ వ్యక్తి పలు ఆరోపణలు చేస్తూ కలెక్టర్‌కు కొన్ని ఆధారాలు చూపించడంతో దీనిపై విచారించి నివేదిక పంపాలంటూ తహసీల్దారును ఆదేశించారు. నిర్ధారణ అయితే సస్పెండ్‌ చేయాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని