logo

క్యాన్సర్‌ బాధితులు ఎక్కువున్న గ్రామాలను హాట్‌స్పాట్లుగా గుర్తిస్తాం

క్యాన్సర్‌ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి త్వరితగతిన చికిత్స అందించేందుకు చర్యలు చేపడతామని తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు కె.వెంకటరమణారెడ్డి, ఎం.హరినారాయణన్‌ పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 01:56 IST

తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు

ర్యాలీ ప్రారంభిస్తున్న కలెక్టర్లు, తితిదే జేఈవో, స్విమ్స్‌ సంచాలకురాలు

తిరుపతి(స్విమ్స్‌): క్యాన్సర్‌ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి త్వరితగతిన చికిత్స అందించేందుకు చర్యలు చేపడతామని తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు కె.వెంకటరమణారెడ్డి, ఎం.హరినారాయణన్‌ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం స్విమ్స్‌ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. తితిదే జేఈవో సదాభార్గవి, డీఎంహెచ్‌వో శ్రీహరి, వేదిక్‌ వర్సిటీ వీసీ ఆచార్య రాణి సదాశివమూర్తి, స్విమ్స్‌ సంచాలకురాలు వెంగమ్మ, బీఐవో ప్రత్యేకాధికారి జయచంద్రారెడ్డితో కలిసి అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్విమ్స్‌లో ‘కేర్‌ ట్రాకర్‌ యాప్‌’ను ప్రారంభి మాట్లాడుతూ.. స్విమ్స్‌లో చికిత్స పొందిన క్యాన్సర్‌ బాధితులు ఇంటి నుంచే వైద్యులను సంప్రదించి మందులు ఎలా వాడాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సలహాలు, సూచనలు యాప్‌ ద్వారా పొందవచ్చని వివరించారు. శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల భవనంలో పాలియేటివ్‌ కేర్‌ వింగ్‌ను ప్రారంభించారు. చికిత్సకు నయం కాని క్యాన్సర్‌ బాధితులు ఉపశమనం పొందడానికి ఈ విభాగం ఉపయోగపడుతుందన్నారు. స్విమ్స్‌, టాటా ఆస్పత్రుల ఆధ్వర్యంలో మరింతగా రాయలసీమ జిల్లాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు.

* మహతి ఆడిటోరియంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. రొమ్ము క్యాన్సర్‌ పోస్టర్‌ ప్రజంటేషన్‌లో వైద్య విద్యార్థులు శోభనరాణి, డి.భావనశ్రీ, బి.శిల్ప మొదటి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు