logo

అంతర్జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు లాస్య

జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో చిత్తూరులోని క్యాంఫర్డ్‌ పాఠశాల పదో తరగతి విద్యార్థిని లాస్య రాణించి మొదటి స్థానంలో నిలిచిందని, అమెరికాలో త్వరలో జరిగే అంతర్జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొననున్నదని పాఠశాల నిర్వాహకులు సీఆర్‌ మహేష్‌ తెలిపారు.

Published : 05 Feb 2023 01:56 IST

లాస్య, గైడ్‌ టీచర్‌ శోభన్‌బాబును సత్కరిస్తున్న మహేష్‌

చిత్తూరు విద్య: జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో చిత్తూరులోని క్యాంఫర్డ్‌ పాఠశాల పదో తరగతి విద్యార్థిని లాస్య రాణించి మొదటి స్థానంలో నిలిచిందని, అమెరికాలో త్వరలో జరిగే అంతర్జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొననున్నదని పాఠశాల నిర్వాహకులు సీఆర్‌ మహేష్‌ తెలిపారు. విశ్వేశ్వరయ్య బైపాస్‌ రోడ్డు పక్కనున్న పాఠశాలలో లాస్యను శనివారం యాజమాన్యం సత్కరించింది. రాష్ట్రం తరఫున పాల్గొన్నదని, 690 ప్రాజెక్టులు ప్రదర్శించగా 13 ప్రాజెక్టులు అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యాయని, అందులో ఎకో ఫ్రెండ్లీ ప్రిజర్వేటివ్‌ సాచెట్స్‌ ప్రాజెక్టును గైడ్‌ టీచర్‌ శోభన్‌బాబు సహకారంతో ప్రదర్శించి తొలి బహుమతి సాధించిందని చెప్పారు. పాఠశాల ఛైర్‌పర్సన్‌ కీర్తి మహేష్‌, డైరెక్టర్లు మేథిని, దీక్ష అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు