logo

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో సరకు రవాణా రైలు పట్టాలు తప్పింది. శనివారం ఉదయం చెన్నై నుంచి రాజస్థాన్‌కు కార్లతో రైలు బయలుదేరింది.

Published : 05 Feb 2023 01:56 IST

రేణిగుంట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో సరకు రవాణా రైలు పట్టాలు తప్పింది. శనివారం ఉదయం చెన్నై నుంచి రాజస్థాన్‌కు కార్లతో రైలు బయలుదేరింది. సాయంత్రం స్టేషన్‌ సమీపంలోని 8వ నంబర్‌ రోడ్డులోని దక్షిణ క్యాబిన్‌ వద్దకు రైలు చేరుకుంది. ఈ సమయంలో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే గమనించిన లోకో పైలెట్లు రైలును నిలిపేశారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. పక్కకు వచ్చిన బోగీలను హ్రైడోలిక్‌ జాక్స్‌ ద్వారా సీఅండ్‌డబ్ల్యూ, ఎలక్ట్రికల్‌ సిబ్బంది రాత్రి సుమారు 7.50 గంటలకు పట్టాలపైకి చేర్చారు. ఈ ఘటనతో ఐదో నెంబర్‌ ప్లాట్‌ఫాంపై రావాల్సిన రైళ్లను ఇతర ప్లాట్‌ఫాంల మీదుగా మళ్లించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని