లోకాయుక్తలో కేసు.. డీఎల్‌పీవో విచారణ
కోటలోని ర.భ.శాఖ కార్యాలయ రోడ్డులో నివాసాల మధ్య ఉన్న సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్‌పీవో వెంకటరమణ, పలువురు అధికారులు శనివారం పరిశీలించారు.
కోట, న్యూస్‌టుడే: కోటలోని ర.భ.శాఖ కార్యాలయ రోడ్డులో నివాసాల మధ్య ఉన్న సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్‌పీవో వెంకటరమణ, పలువురు అధికారులు శనివారం పరిశీలించారు. ఇక్కడి నుంచి వచ్చే బూడిద, ఇతర వ్యర్థాలతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికుల తరఫున సీనియర్ న్యాయవాది పేల్లేటి గోపాల్‌రెడ్డి లోకాయుక్తలో కేసు వేయడంతో అధికారులు నివాసితులతోపాటు సర్పంచి వెంకట రమణమ్మ, ఎంపీటీసీ సభ్యుడు మొబీన్ బాషాను విచారించారు. న్యాయవాదితో చర్చించారు. డీఎల్‌పీవో మాట్లాడుతూ కేంద్రంపై నివాసితులు, ప్రజాప్రతినిధులు, ఇతరులు వ్యతిరేకత వ్యక్తం చేశారని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి.. స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా