logo

సాగు కష్టమే..!

రబీ సాగుపై వర్షాలు, పెరిగిన సాగు ఖర్చుల ప్రభావం పడింది.. తద్వారా పంటల సాగు మందకొడిగా సాగుతోంది.. జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 29,026 హెక్టార్లకు గాను ఇప్పటికీ 16,556 హెక్టార్లు సాగైంది.

Published : 06 Feb 2023 02:32 IST

ఇప్పటికి 56.12శాతమే  
మందకొడిగా రబీ సీజన్‌
న్యూస్‌టుడే, చిత్తూరు(వ్యవసాయం)

బీ సాగుపై వర్షాలు, పెరిగిన సాగు ఖర్చుల ప్రభావం పడింది.. తద్వారా పంటల సాగు మందకొడిగా సాగుతోంది.. జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 29,026 హెక్టార్లకు గాను ఇప్పటికీ 16,556 హెక్టార్లు సాగైంది.. కురిసిన భారీ వర్షాలకు సాగునీటికి కొదవ లేదు.. రబీ సీజన్‌ ప్రారంభమై నాలుగు నెలలు పూర్తయినా నేటికీ అరక ముందుకు సాగడం లేదు.. విత్తు పడటం లేదు.. ప్రభత్వ చేయూత కరవు కావడంతో అన్నదాతలు సైతం సాగు వైపు అంతగా ఆసక్తి చూపడం లేదు.

ప్రోత్సాహం కరవు.. వ్యవసాయంలో ప్రభుత్వ ప్రోత్సాహం, రాయితీ పథకాలు కరవు కావడంతో పంటల సాగుకు అన్నదాతలు ఆసక్తి చూపడం లేదు. రబీలో సాగయ్యే ప్రధాన పంటల్లో వరి, వేరుసెనగ, ఉలవ పంటల విస్తీర్ణమే అధికం. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లతో దున్నడం, కూలీ రేట్ల పెరుగుదలతో ఈసారి పంటల సాగుపై పెట్టుబడులు మరింతగా పెరిగాయి. వరి పంట సాగుపై గతంతో పోల్చితే 30-40శాతం పెరిగింది. ఇదేస్థాయిలో మిగిలిన పంటలపై ఖర్చులూ పెరిగాయి. దిగుబడి తగ్గుతోంది. గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులు తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. వ్యవసాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలైన కూరగాయలు, ఉద్యాన వాణిజ్య పంటల సాగు చేయాలని రైతులు ముందుకెళుతున్నారు.


లక్ష్యాన్ని సాధిస్తాం..

-హబీబ్‌ బాషా, ఇన్‌ఛార్జి జేడీఏ

రబీ సాగు లక్ష్యాన్ని సాధిస్తాం. క్షేత్రస్థాయిలో రబీ పంటల సాగు విస్తరణకు ఆర్‌బీకే సిబ్బంది ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. చిరుధాన్యాల సాగు విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని