logo

ఆగమోక్తంగా సువర్ణముఖి పుష్కరోత్సవం

మాఘ పూర్ణిమను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నది పుష్కరోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ముక్కంటి ఆలయం నుంచి శ్రీవినాయకస్వామి.

Published : 06 Feb 2023 02:32 IST

నదిలో పుష్కర స్నానం చేస్తున్న భక్తులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మాఘ పూర్ణిమను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నది పుష్కరోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ముక్కంటి ఆలయం నుంచి శ్రీవినాయకస్వామి, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, శ్రీసోమస్కందమూర్తి, శ్రీజ్ఞానాంబిక, శ్రీచండికేశ్వర స్వామి ఉత్సవమూర్తులతో పాటు ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామి కొలువుదీరిన త్రిశూలాన్ని సువర్ణముఖి నదీ తీరానికి తీసుకెళ్లి పూజలు జరిపారు. సంకల్ప పూజల అనంతరం త్రిశూలాన్ని నదీ తీరంలో ఏర్పాటు చేసిన పుష్కరిణిలో స్నానం చేయించారు. భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు.

త్రిశూలానికి స్నానం చేయిస్తున్న అర్చకస్వాములు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని