logo

అస్టర్‌ నారాయణాద్రి హాస్పిటల్‌ ప్రారంభం

తిరుపతిలో అస్టర్‌ నారాయణాద్రి హాస్పిటల్‌ను ఆదివారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

Published : 06 Feb 2023 02:32 IST

ఆస్పత్రిని ప్రారంభిస్తున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి,

మంత్రి ఆర్‌కే రోజా, ఎమ్మెల్యే చెవిరెడ్డి తదితరులు

తిరుపతి(వైద్యం): తిరుపతిలో అస్టర్‌ నారాయణాద్రి హాస్పిటల్‌ను ఆదివారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, కోరుముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ద్వారకనాథ్‌రెడ్డి, నగర మేయర్‌ శిరీష, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, డీఎంహెచ్‌ఓ శ్రీహరి, హెల్త్‌ ఆఫీసర్‌ హరికృష్ణ పాల్గొన్నారు. అస్టర్‌ డీఎమ్‌ హెల్త్‌కేర్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ ఆజాద్‌ మూపెన్‌ మాట్లాడుతూ.. అస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ 18వ యూనిట్‌ని తిరుపతిలో ప్రారంభించినట్లు చెప్పారు. సరసమైన ధరలకు ప్రపంచ స్థాయి వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. డాక్టర్లు సునందకుమార్‌ రెడ్డి, సుబ్బారావు, గోపికృష్ణారెడ్డి, మధు కృష్ణారెడ్డి,  మధుసూదన్‌, నాగరాజు, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు