logo

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే

సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని, జీపీఎస్‌ అమలు చేస్తామంటే సమ్మతించే ప్రసక్తి లేదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రఘుపతిరెడ్డి స్పష్టం చేశారు.

Published : 06 Feb 2023 02:32 IST

సంకల్ప దీక్ష చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని, జీపీఎస్‌ అమలు చేస్తామంటే సమ్మతించే ప్రసక్తి లేదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రఘుపతిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 3న విజయవాడలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సంకల్ప దీక్షను పోలీసులు భగ్నం చేసినందుకు నిరసనగా ఆదివారం స్థానిక ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా కార్యాలయంలో నాయకులు, ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీరమణ మాట్లాడుతూ రాజస్థాన్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దు చేశారని, అదే రీతిన ఇక్కడా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దీన్ని అమలు చేయాలని శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే అణచివేయాలని చూడటం దుర్మార్గమని తెలిపారు. సమాఖ్య నాయకులు శేఖర్‌, రెడ్డప్పనాయుడు, దక్షిణామూర్తి, కృష్ణమూర్తి, రమణ, పార్థసారథి, చిట్టి బాబు, వెంకటేష్‌, సీసీఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఎస్పీ బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని