logo

పోలీసు శాఖకు ఆయువుపట్టు సాయుధ దళం

క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు వ్యవస్థను కాపాడుకుంటూ ప్రజలకు చక్కటి సేవలందించాలని అనంతపురం డీఐజీ రవిప్రకాష్‌ పిలుపునిచ్చారు.

Published : 06 Feb 2023 02:32 IST

ఆయుధాలు పరిశీలిస్తున్న డీఐజీ రవిప్రకాష్‌, ఎస్పీ పరమేశ్వరరెడ్డి తదితరులు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు వ్యవస్థను కాపాడుకుంటూ ప్రజలకు చక్కటి సేవలందించాలని అనంతపురం డీఐజీ రవిప్రకాష్‌ పిలుపునిచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం తిరుపతి జిల్లా సాయుధ దళంలో తనిఖీలు నిర్వహించారు. స్థానిక పరేడ్‌ మైదానంలో సాయుధ దళం, బీడీ టీం ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శనను ఎస్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి తిలకించారు. ఇన్‌స్పెక్షన్‌ పీరియడ్‌తో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రధాన కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, వాహనాలను తనిఖీ చేశారు. అదనపు ఎస్పీలు వెంకటరావు, కులశేఖర్‌, విమలకుమారి, సెబ్‌ జేడీ రాజేంద్ర, లక్ష్మీనారాయణ రెడ్డి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని