logo

రీ సర్వేలో పొరపాట్లు సరిచేయాలని నిరసన

ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ భూముల రీసర్వే కార్యక్రమంలో పొరపాట్లను సరిచేయాలని కోరుతూ గంగవరం మండలం మారేడుపల్లె గ్రామానికి చెందిన రైతులు సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

Published : 07 Feb 2023 01:42 IST

సర్వే చేసిన రికార్డుల్లో పొరపాట్లను చూపిస్తున్న రైతులు

పలమనేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ భూముల రీసర్వే కార్యక్రమంలో పొరపాట్లను సరిచేయాలని కోరుతూ గంగవరం మండలం మారేడుపల్లె గ్రామానికి చెందిన రైతులు సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విస్తీర్ణంలో ఎక్కువ తక్కువలు చూపిస్తున్నారని, నంబర్లు తప్పుగా వస్తున్నాయని వాపోయారు. భూమికి సంబంధించిన అనుభవదారుల పేర్లను పుస్తకంలో నమోదు చేయడం లేదని ఆవేదన చెందారు. సంబంధిత అధికారులు నేరుగా వ్యవసాయ భూమి దగ్గరకు వచ్చి హద్దులను గుర్తించాలని కోరారు. ఈ విషయమై తహసీల్దారు ఏమాత్రం స్పందించకపోవడంతో ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చామన్నారు. ఈ ఆందోళనలో రైతులు గురుమూర్తి, వెంకటేశులు, బాలరాజు, హరినాథ్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని